వివాదంలో చిక్కుకున్న మరో తెలుగు సినిమా...

Update: 2019-09-26 11:53 GMT

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కొన్ని వివాదంలో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో వివాదాలు ఎదురుకుంటున్నాయి. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాకి ముందుగా వాల్మీకి అనే టైటిల్ ని పెట్టారు. దీనితో సినిమా టైటిల్ విషయంలో వివాదం ఏర్పడింది. దీనితో సినిమా విదుదలకు ముందు రోజు సినిమా టైటిల్ ని మార్చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఇదే తరహలో మరో సినిమా చిక్కుల్లో పడింది. వెంకట్‌, వృశాలి, పావని హీరో హీరోయిన్లుగా "రాయలసీమ లవ్ స్టొరీ" అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి రమణధీర్‌ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాని అభ్యంతరకరమైన దృశ్యాలతో అశ్లీల చిత్రంగా రూపొందించారని, రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, సినిమా టైటిల్‌ మార్చి దర్శక నిర్మాతలు రాయలసీమ ప్రజలను క్షమాపణ కోరాలని లేకపోతే సినిమాని విడుదలని అడ్డుకుంటామని రాయలసీమ ప్రత్యేక హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగింది. సినిమాకి సంబంధించిన పోస్టర్లను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు.

Tags:    

Similar News