చిరు, కొరటాల మూవీ మొదలయ్యేది అప్పుడే
సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నసంగతి తెలిసిందే.
సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకుంది ఈ సినిమా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ కలిసి నిర్మిస్తుంది.
పక్కా సోషల్ మెసేజ్ తో ఈ చిత్రం రూపొందుతుంది. దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి నేపథ్యంలో కథ సాగనున్నట్లు వినికిడి.. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగోగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి గోవిందా గోవిందా, గోవిందా ఆచార్య అనే టైటిల్స్ ని పరిశీలనలో ఉంచారు. ఇందులో చిరు సరనస త్రిష కన్ఫర్మ్ అయిపొయింది. కానీ ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తి కేవలం మెగా అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుల కూడా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 26న ఈ ప్రాజెక్ట్‌ని కొరటాల సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడని సమాచారం. మంచి హిట్లతో దూకుడు మీదా ఉన్న కొరటాల చిరంజీవితో సినిమా తీస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.