కౌన్ బనేగా కరోడ్పతి అనే షోకి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ షోకి చాలా మంది సెలబ్రిటీలు వస్తారు. కానీ నిన్న ఎపిసోడ్ కి మాత్రం ఎవరు ఉహించని గెస్ట్ వచ్చి అందరిని సప్రైజ్ చేసింది. అ గెస్ట్ ఎవరో కాదు పిల్లి.. పాపం ఎక్కడినుండి వచ్చిందో తెలియదు కానీ వచ్చింది. పిల్లి రావడంతో అందరు హాయ్ గా నవ్వుకున్నారు. ఆ పిల్లి కూడా షోని బాగానే ఎంజాయ్ చేసింది.
ఈ విషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందులో ఫోటోలు అటాచ్ చేసిన అమితాబ్ ఓ కామెడి క్యాప్షన్ కూడా పెట్టారు. 'ఏయ్ పిల్లి. ఈ షోలో నువ్వు కూడా ఆడతావా? ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ రాగానే అలసిపోయి నిద్రపోయింది' అని కామెంట్ చేశారు. దీనిపైన నెటిజన్లు తమదైన శైలో స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అమితాబ్ ఇటీవల అనారోగ్యంతో లీలావతి హాస్పిటిల్లో చేరి ,చికిత్స అనంతరం వెంటనే షూటింగ్లో పాల్గొన్నారు.
T 3534 - 🤣🤣🤣
— Amitabh Bachchan (@SrBachchan) October 30, 2019
ऐ बिलौरी , बिल्ली बिल्ली , खेलन चली KBC
जैसे आइ Fastest Finger, लोट पोट हो गयी वहीं ~ अब pic.twitter.com/3pq49UfSXR