పూజా హేగ్దేతో బోని కపూర్... పవన్ సినిమా కోసమేనా ?

Update: 2019-11-05 05:42 GMT
pooja hegdhe, Boney kapoor

బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సౌత్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అజిత్ తో ఓ సినిమా చేసిన బోని ఇప్పుడు మరో సినిమాకి సిద్దమయ్యాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా పింక్ అనే బాలీవుడ్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైన బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఇప్పటికే ట్వీట్ చేసాడు. ఇందులో బోని కపూర్ ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు తో కలిసి చేస్తారని, వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తారని వెల్లడించాడు.

అయితే తాజాగా బోని కపూర్ హీరోయిన్ పూజా హగ్దే ను కలిసారు. బోని పూజను కలవడం ఏంటి అన్న చర్చ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతుంది. ఈ కలయిక పవన్ సినిమా కోసమా లేక అజిత్ సినిమా కోసమా అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం పూజా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ తో అల వైకుంటపురములో అనే సినిమా చేస్తూనే ,ఇటు ప్రభాస్, అఖిల్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది పూజా.. ఇప్పుడు బోనితో మీటింగ్ లో పూజా ఏ హీరో సినిమాకి డేట్స్ ఇవ్వనుంది అన్నది తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News