బాలయ్య న్యూలుక్ చూసారా?

ఇందులో బాలయ్య చేతిలో గోల్ఫ్ బ్యాట్ పట్టుకొని , త‌ల‌కి క్యాప్‌, క‌ళ్ళకి అద్దాలతో యంగ్ హీరోలని మించిపోయే లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

Update: 2019-11-16 13:00 GMT
Balakrishna new look

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రూలర్.. కే యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు.ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. వేదిక, సోనాలి చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. సినిమాని డిసెంబర్రి20 న లీజ్ చేయనున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన బాలయ్య లుక్ ని విడుదల చేసిన టీం, తాజాగా మరో లుక్ ని బయటకు వదిలింది.

ఇందులో బాలయ్య చేతిలో గోల్ఫ్ బ్యాట్ పట్టుకొని , త‌ల‌కి క్యాప్‌, క‌ళ్ళకి అద్దాలతో యంగ్ హీరోలని మించిపోయే లుక్‌లో క‌నిపిస్తున్నాడు.ఈ సినిమా కోసం బాలయ్య చాలా బరువు తగ్గి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన ఫాన్స్ బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి చిరంతన్ బట్ సంగీతం అందిస్తున్నారు. 

Tags:    

Similar News