యంగ్ హీరోలను మించిపోయేలా ... రూలర్ నుండి బాలకృష్ణ న్యూ లుక్

Update: 2019-11-09 14:17 GMT
Balakrishna

కేయస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రూలర్ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన వేదిక ,సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీ కళ్యాణ్ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఎప్పుడు కనిపించని న్యూ లుక్ లో బాలకృష్ణ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం..ఇందులో బాలకృష్ణ ఓ పోలీస్ ఆఫీసర్ లుక్ లో ఉన్నట్టుగా కనిపించాడు. అయితే తాజాగా మరో లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం.. ఇందులో బాలకృష్ణ నేటి యువతరం కథానాయకులను మించిపోయేలా కనిపిస్తున్నాడు. డ్రెస్సింగ్, లుక్ ఇలా అన్నింటిలోను బాలయ్య కొత్తగా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాకి చిరంతన్ బట్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కేరళలో బాలకృష్ణ, వేదికల మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 20 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. 




 


Tags:    

Similar News