రూలర్ క్లోజింగ్ కలెక్షన్స్
జై సింహ తర్వాత నందమూరి బాలకృష్ణ, కేయస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రూలర్.. గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలైంది ఈ సినిమా.
జై సింహ తర్వాత నందమూరి బాలకృష్ణ, కేయస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రూలర్.. గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలైంది ఈ సినిమా.. బాలకృష్ణ సరసన వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని సీ కళ్యాణ్ నిర్మించగా, చిరంతన్ భట్ సంగీతం అందించాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. కథ రొటీన్ అవ్వడం, పోటిగా వచ్చిన సినిమాలకి మంచి రెస్పాన్స్ అవ్వడంతో సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. పెట్టుబడిలో కనీసం మూడో వంతు కలెక్షన్స్ ను సాధించడంలో కూడా విఫలమైంది. ఫుల్ రన్ లో కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డీలా పడింది.
గత ఏడాది బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా మిగిలిపోయాయని చెప్పాలి.
రూలర్ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్:
♦ నైజాం :Rs 1.35 Cr
♦ సీడెడ్ : Rs 1.95 Cr
♦ నెల్లూరు: Rs 0.36 Cr
♦ కృష్ణ: Rs 0.41 Cr
♦ గుంటూరు: Rs 1.35 Cr
♦ వైజాగ్ : Rs 0.50 Cr
♦ ఈస్ట్ : Rs 0.40 Cr
♦ వెస్ట్ : Rs 0.40 Cr
♦ ఆంధ్ర+తెలంగాణ : Rs 6.72 Cr
♦ రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 0.50 Cr
♦ ఓవర్సీస్: Rs 0.34 Cr
♦ వరల్డ్ వైడ్ : Rs 7.56 Cr
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా క్యాథరిన్ ఫైనల్ అయిందని తెలుస్తోంది.. కానీ చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.