మహేష్ సపోర్ట్ తోనే ఇదంతా : అనిల్ రావిపూడి

సరిలేరు నీకెవ్వరు టిజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

Update: 2019-11-24 14:33 GMT
anil ravipudi birthday celebrations

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం "సరిలేరు నికేవ్వరు".. ఇప్పటికే చిత్ర టిజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.. టిజర్ కి గాను ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అతి తక్కువ టైంలో చాలా మంది లైక్ చేసిన టిజర్ గా సరిలేరు నీకెవ్వరు రికార్డు సృష్టించింది. టిజర్ కి వస్తున్న రెస్పాన్స్ పై చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.

శనివారం(నవంబర్ 23) రోజున పుట్టినరోజు జరుపుకున్న అనిల్ రావిపూడికి చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. సెట్లో కేక్ తెప్పించి దర్శకుడు అనిల్ చేత కట్ చేయించారు. ఇందులో హీరో మహేష్ తో పాటు, నిర్మాతల్లో ఒకరైనా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు అనిల్..

సరిలేరు నీకెవ్వరు టిజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మహేష్ సపోర్ట్ తోనే ఇదంతా సాధ్యపడింది. అని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు.

భారీ అంచనాల నడుమ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని మహేష్ బాబు తో కలిసి దిల్ రాజు ,అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు.



Tags:    

Similar News