Anasuya: రంగమ్మత్తకు రెండింతల బోల్డ్ అండ్ బ్యూటీతో అనసూయ రచ్చ..

Anasuya: అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విమానం. అనసూయ పుట్టినరోజును పురస్కరించుకొని మేకర్స్ గ్లింప్స్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేశారు. కళ్లకు కాటుక, మెడపై పౌడర్, ఒంపు సొంపులు కనిపించేలా చీరకట్టులో అనసూయ వేరే లెవల్ లో రచ్చ..

Update: 2023-05-16 08:39 GMT

Anasuya: రంగమ్మత్తకు రెండింతల బోల్డ్ అండ్ బ్యూటీతో అనసూయ రచ్చ..

Anasuya: అనసూయ భరద్వాజ్..పరిచయం అవసరం లేని పేరిది. యాంకర్ గా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండితెరకు ప్రమోట్ అయ్యి..రంగమ్మత్తగా ఎలలేని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ అదరగొట్టింది. అనసూయలోని టాలెంట్ ని చూసిన దర్శకనిర్మాతలు ప్రస్తుతం ఆమెతో సినిమాలు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వరిస్తున్నాయి.

అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విమానం. తెలుగు, తమిళ భాషల్లో జీ స్టూడియోస్- కిరణ్ కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా..అనసూయ పుట్టినరోజును పురస్కరించుకొని మేకర్స్ గ్లింప్స్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనసూయ చాలా సెక్సీగా కనిపించింది. అంతేకాదు, అనసూయ పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో కూడా హాట్ గా దర్శనం ఇచ్చింది. వీడియోలో సుమతి అనే మహిళగా కనిపించిన అనసూయ..కళ్లకు కాటుక, మెడపై పౌడర్, ఒంపు సొంపులు కనిపించేలా చీరకట్టులో దర్శనం ఇచ్చింది.

విమానం గ్లింప్స్ చూస్తే..ఈ చిత్రంలో అనసూయ వేశ్య పాత్రను పోషిస్తున్నట్లు డౌట్ రాక మానదు. ఎందుకంటే అంత బోల్డ్ లుక్ లో కనిపించింది. వేదంలో అనుష్కకు సరోజా క్యారెక్టర్ ఎంత పేరు తెచ్చిందో..విమానంలో సుమతి క్యారెక్టర్ అనసూయకు అంతే పేరు తెస్తుందని ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, అనసూయను వైన్ తో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఓల్డ్ అయ్యే కొద్దీ వైన్ ఎలాగైతే టేస్ట్ పెరుగుతుందో...వయసు పెరిగేకొద్ది తమ అభిమాన నాయిక గ్లామర్ రెట్టింపు ఔతోందంటూ కితాబులిచ్చేస్తున్నారు. 

Tags:    

Similar News