బన్ని సినిమా అల్ టైం ఇండస్ట్రీ హిట్.. మరి మహేష్ సినిమా పరిస్థితి ఏంటి ?
ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 11 న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, జనవరి 12 న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి.
ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 11 న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, జనవరి 12 న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి.. అయితే విడుదలకి ముందు ఈ రెండు చిత్రాల మధ్యే వార్ సాగుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే సినిమాలకి మొదటి అట నుంచి మంచి టాక్ రావడంతో అదే జరిగింది కూడా.. విడుదల తేదిల నుంచి కలెక్షన్ల వరకు ఎక్కడ కూడా తగ్గకుండా రేసులో ఇద్దరు పోటిపడ్డారు.
కేవలం సినిమాలు మాత్రమే కాదు చిత్రయూనిట్ల మధ్య వార్ జరిగిందన్న ప్రచారం బాగా సాగింది. సినిమా తోలి రోజు సరిలేరు నీకెవ్వరు 46 కోట్లకుపైగా షేర్ సాధించినట్టుగా ప్రకటిస్తే, అల వైకుంఠపురములో షేర్ కాకుండా 85 కోట్ల గ్రాస్ అంటూ మరింత పెద్ద నంబర్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా తొలి వారం తర్వాత సరిలేరు నీకెవ్వరు వంద కోట్లకు షేర్ సాధించినట్టుగా పోస్టర్ రిలీజ్ చేయగా, అల వైకుంఠపురములో సినిమా 6 రోజుల్లోనే 104 కోట్ల షేర్ సాధించినట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా సరిలేరు నీకెవ్వరు పది రోజుల్లో 200 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా పోస్టర్ రిలీజ్ చేస్తే, అల వైకుంఠపురములో యూనిట్ ఆ మరుసటి రోజే 220 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఇక తాజాగా అల వైకుంఠపురములో సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. మరి మహేష్ సరిలేరు నీకెవ్వరు వసూళ్లు వేటలో వెనకపడిందా? లేకా మహేష్ మూవీ నుంచి మరో క్రేజీ పోస్టర్ రానుందా అన్న ఆసక్తి కలుగుతుంది.
అల వైకుంఠపురములో సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. జూలయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి హ్యాట్రిక్ గా నిలిచింది. ఈ సినిమాలో టబు, మురళీశర్మ, సుశాంత్, సునీల్, నివేతా పెతురాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సినిమాని నిర్మించగా, తమన్ సంగీతం అందించాడు.
Thank you for giving us such a huge gift for Sankranthi for entertaining you. #AlaVaikunthapurramuloo is an All-Time Industry hit (Non-BB) in 2 weeks of its release & We couldn't have asked for more!💚🤩#NonBBIndustryHitAVPL@alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/4cAzQRy1sV
— Geetha Arts (@GeethaArts) January 26, 2020