వామ్మో సమంత.. జిమ్లో 100 కేజీల లోడ్ ఎత్తేసింది!
హీరో, హీరోయిన్స్ తమ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా జిమ్లో చాలా వర్కౌట్ల చేస్తూ ఎప్పటికప్పుడు తమ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు.
హీరో, హీరోయిన్స్ తమ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా జిమ్లో చాలా వర్కౌట్ల చేస్తూ ఎప్పటికప్పుడు తమ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. ఇక అక్కినేని కోడలు సమంత పెళ్లి అయినప్పటికీ తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. అయితే జిమ్లో కష్టపడుతున్న విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది ఈ భామ..
తాజాగా సమంత జిమ్లో 100 కిలోల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. "నా పాత నేస్తమా.. మళ్ళీ నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది .. 100 కేజీల సుమో డెడ్ లిఫ్ట్" అని పేర్కొంది. దీనిని చూసిన నెటిజన్లు అమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత నువ్వు గ్రేట్, సూపర్బ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఎం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది సమంత.. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం మొదలగు చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఇక తన సహనటుడు అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం పాత్రలకి ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తోంది. తాజాగా 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత.. ఈ సినిమా అనుకున్నంతగ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషలలో నటిస్తోంది.
The strongest 💪💪💪 @Samanthaprabhu2 #SamanthaAkkineni pic.twitter.com/Sj7lYw8u8f
— Samantha Akkineni FC (@Sam_Fan_Club) March 6, 2020