ఆఫ్ఘనిస్థాన్ కి ఊపిరి ఆడనివ్వలేదు

Update: 2019-06-08 16:33 GMT

వరల్డ్ కప్ టోర్నీలో 13 వ మ్యాచ్ న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లమధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టింది. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్ నీషం ఆఫ్ఘానిస్తాన్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. పది ఓవర్లలో 31 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఫెర్గుసన్ మరో పక్క నుంచి 9 . 1  ఓవర్లలో 37 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఏ దశలోనూ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్ పోటీ ఇవ్వలేకపోయారు. అయితే, ఓపెనర్ల తరువాత షాహిదీ 99 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేశాడు. అతనికి మిగిలిన వారి నుంచి సహాయమూ లభించలేదు. పరుగులు చేయకుండా వికెట్ కాపాడుకునే ధ్యాసలోనే బ్యాట్స్ మెన్ అందరూ ప్రయత్నించడంతో వారు ఆలౌట్ అవడానికి 41 ఓవర్లు పట్టింది. కేవలం 172 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ముందు తేలికపాటి లక్ష్యాన్ని ఉంచింది. 

Tags:    

Similar News