సహజంగా మనం వాడుకునే కరెంట్ కి అ తర్వాత వచ్చే కరెంట్ బిల్లకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు . అప్పుడప్పుడు అ బిల్లు లక్షల నుండి కోట్లు కూడా దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు . ఇది ఇప్పటికి సామాన్యులకు జరిగినట్టుగా మనం చూసాం . కానీ పాపం ప్రముఖ హీరోయిన్ కూడా ఇదే కష్టం వచ్చిందట .. లక్ష్మి రాయ్ తన ఇంటికి వచ్చినా కరెంట్ బిల్లును చూసి షాక్ అవుతుందట ..! అది కూడా ఎలా అంటే ఒక నెలకు కట్టిన కరెంట్ బిల్ మళ్ళీ ఇంకో నల వచ్చేసరికి డబల్ అవుతుందట ..
Observing my electricity bill cycle since months .. its almost double than what i have been paying every month..& i have barely been home past 3 months to see my bill shoot up..
— RAAI LAXMI (@iamlakshmirai) July 16, 2019
Repeated attempts of contacting ADANI ELECTRICITY on toll free number has failed. @Adani_Elec_Mum pic.twitter.com/jqh0xG6idc
దీనితో విసిగిపోయిన లక్ష్మి రాయ్ ఎలక్ట్రిసిటీ టోల్ ప్రీ నెంబర్ కి కాల్ చేసిన వాళ్ళు అసలు రెస్పాండ్ కావడం లేదట .. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు . దీనినుండి నన్ను ఎవరైనా గట్టేకించండి. కష్టపడి ఇలా డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే నాకు ఎంతో భాదగా ఉందని ఆమె అందులో వ్యక్తం చేసారు . అయితే ఆమె ట్వీట్ ని గుర్తించిన ఎలక్ట్రిసిటీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు . మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము . త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని ఆమె ట్వీట్ కి రీట్వీట్ చేసారు ..