Actor Sunil in Seetimaar Movie: సునీల్ కి మరో ఛాన్స్.. ఈసారైనా నిలబెట్టుకుంటాడా?

Actor Sunil in Seetimaar Movie: కమెడియన్ గా కెరీర్ ని మొదలు పెట్టిన సునీల్ టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయాడు..

Update: 2020-06-28 09:30 GMT

Actor Sunil in Seetimaar Movie: కమెడియన్ గా కెరీర్ ని మొదలు పెట్టిన సునీల్ టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయాడు.. అక్కడి నుంచి హీరోగా మారి మొదట్లో మంచి హిట్స్ కొట్టినప్పటికి ఆ తర్వాత వరుస అపజయాలు సునీల్ ని వెంటాడాయి.. దీనితో రూట్ మార్చిన సునీల్ మళ్లీ తనకి అచ్చోచ్చిన కామెడీ వేశాలకు పరిమితం అయ్యాడు.. అందులో భాగంగానే చిత్రాలహరి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో మొదలగు సినిమాలలో కమెడియన్ గా సునీల్ కనిపించినప్పటికి సునీల్ కి అనుకున్నంతగా పేరు అయితే రాలేదు..

అయితే సునీల్ కి కమెడియన్ గా మళ్లీ కం బ్యాక్ అనిపించుకునేందుకు మరో ఆఫర్ వచ్చేసింది. గోపిచంద్ , తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సీటిమార్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు సంపత్ నంది సునీల్ ని తీసుకున్నాడు.. సునీల్ అయితే ఆ పాత్ర పండుతుందని నమ్మి ఛాన్స్ ఇచ్చాడట సంపత్ నంది.. మరి ఈ సినిమాతో అయిన మళ్లీ సునీల్ కం బ్యాక్ అనిపించుకుంటాడో లేదో చూడాలి మరి.. గౌతమ్ నంద చిత్రం తరవాత గోపిచంద్,సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఇందులో హీరో గోపీచంద్ ఏపీ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనుండగా, తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతుంది. వీరిద్దరి మధ్య సునీల్ ఉంటాడని అలా వీరి మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.. దాదాపుగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

ఇక ఈ సినిమా తర్వాత గోపిచంద్, తేజ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు కమిట్ అయ్యాడు.. ఇప్పటికే అనౌన్స్ కూడా చేసేశారు.. గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, నిజం సినిమాలో గోపిచంద్ విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే..



Tags:    

Similar News