తన పుట్టుక గురించి రహస్యం చెప్పిన మోహన్ బాబు

భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు పెద్దగా పరిచయం అక్కరలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టిన మోహన్ బాబు.

Update: 2020-02-21 10:59 GMT

భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు పెద్దగా పరిచయం అక్కరలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టిన మోహన్ బాబు.. ఆ తరవాత విలన్ గా మారి ఆ తర్వాత హీరో, నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తనకి మోహన్ బాబు అని పేరు ఎందుకు వచ్చింది అనే దానిపైన అయన స్పష్టతని ఇచ్చారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో దాని విశిష్టతను చెబుతూ.. పరమశివుడితో తనకున్నా అనుభందాన్ని తెలిపారు.

మహాశివరాత్రి అత్యద్భుతమైన రోజు. ముఖ్యంగా మా కుటుంబం గుర్తుపెట్టుకోవల్సిన రోజు. ఎందుకంటే మాది తిరుపతి-కాళహస్తిల మధ్య చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెం. మా అమ్మానాన్నలకు వివాహమై ఎన్నో ఏళ్ళు సంతానం కలగకపోతే ఎవరో చెప్పారట, ఇక్కడకి ఒక 5 కిలోమీటర్లు నడిచి, మరో 5 కిలోమీటర్లు కొండెక్కితే... అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి మొక్కుకుంటే పిల్లలు పుడతారని. ఆ భగవంతుడిని దర్శించుకుని వచ్చారు, మా అమ్మకు ఐదుగురు సంతానం కలిగారు. అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారు మా నాన్నగారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారింది.

అది రహస్యం, నాకు ఈశ్వరుడికి ఉన్న అనుబంధం. ఆయన ఆశీస్సులతో పుట్టినవాడిని నేను, మా కుటుంబమంతా ఆయన ఆశీస్సులతో పుట్టినవాళ్ళమే. అందుకు మహాశివరాత్రి చాలా మంచి పర్వదినం. అందరికీ ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ బాబు సూర్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. అయన చివరగా మహానటి అనే సినిమాలో నటించారు.  


Tags:    

Similar News