హీరోయిన్ ని ముద్దాడబోయిన అభిమాని
తమ అభిమాన నటి, నటుడుని కలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో తప్పేమీ లేదు కానీ అలా కలిసినప్పుడు
తమ అభిమాన నటి, నటుడుని కలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో తప్పేమీ లేదు కానీ అలా కలిసినప్పుడు మాత్రం కొందరు అభిమానులు తమ లిమిట్స్ ని దాటి ప్రవర్తిస్తున్నారు. గతంలో ఇది చాలా విషయాలలో ఇది రుజువైంది. తాజాగా బాలీవుడ్ నటీకి ఇలాంటి పరిణామమే ఎదురైంది. ఎప్పటి లాగే సారా అలీఖాన్ జిమ్ కి వెళ్లి వస్తుండగా అక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ , ఫొటోగ్రాఫర్స్ స్టిల్స్ అడిగారు.
ఈ నేపధ్యంలో ఆమె ఫోటోలకు ఫోజిలిస్తుండగా ఓ అభిమాని ఆమె చేయిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సారా ఆమె చేయిని వెనక్కి తీసేసుకుంది. దీనితో అక్కడున్న సెక్యూరిటీ గార్డు అతన్ని అదుపు చేసి దూరంగా నెట్టివేశాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వీడియోగ్రాఫర్ రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం దీనికి సంబంధించినసోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక సారా అలీఖాన్ 2018లో కేదార్ నాథ్ చిత్రంతో హీరోయిన్గా హీందీ చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం తరువాత ఆమె రణ్బీర్ సింగ్కు జోడిగా టెంపర్ హిందీ రీమేక్ అయిన సింబా చిత్రంలో నటించి బంపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె కూలీ నం.1 రీమేక్, లవ్ ఆజ్ కల్ సీక్వెల్ చిత్రాల్లో నటిస్తోంది.