ఏపీలో గెలుపుపై వైసీపీ ధీమా...మంత్రివర్గం ఏర్పాటుపైనా ముహూర్తాలు ఖరారు ?

Update: 2019-05-20 10:55 GMT

ఏపీలో గెలుపుపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 23న విడుదలయ్యే ఫలితాల్లో తమదే విజయమని ఫిక్స్‌ అయ్యారు. కేబినెట్‌లో మంత్రులుగా ఎవరెవరు ఉండాలి..? ఎప్పుడు ప్రమాణ స్వీకారం అన్నదానిపై కూడా ముహూర్తాలు పెట్టేశారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కొన్ని సర్వేలు వ్యతిరేకంగా రావడంతో పైకి ధీమాగా కనిపిస్తున్నా లోపల ఆందోళన చెందుతున్నారు ఆ పార్టీ నేతలు.

వైసీపీ ముందు నుంచి అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్‌ వచ్చాయి. వైసీపీకి భారీ మెజార్టీ ఇస్తూ నివేదికలు ప్రకటించాయి. ఈ రిపోర్ట్స్ తమ అంచనాలకు దగ్గరగా ఉండటంతో వైసీపీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అటు కేంద్రంలో తమకు అనుకూలంగా ఎన్డీఏ, ఇటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్‌ రావడంతో 23న ఫలితాల్లో కూడా తమకు తిరుగులేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

అయితే, మెజార్టీ సర్వే సంస్థలు తమకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించినా వైసీపీ నేతలు లోలోన మధనపడుతున్నారు. ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్, సీ ఓటర్స్‌తోపాటు కొన్ని తెలుగు ఛానల్స్ టీడీపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు వెల్లడించాయి. దీంతో వైసీపీ నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. లగడపాటి సర్వేను అంతగా పట్టించుకోవాల్సిన అవసరంలేదంటున్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని వైసీపీ స్వీప్ చేయబోతోందని, టీడీపీకి అనుకూలమైన వారే అలాంటి సర్వేలు ప్రకటించారని మండిపడుతున్నారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏపీలో వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేశాయి. మరి 23న విడుదలయ్యే రియల్ ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో చూడాలి.  

Similar News