ఎన్నికల నగారా మోగించిన వైఎస్‌ జగన్‌

Update: 2019-03-11 10:59 GMT

కాకినాడ వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు .కాకినాడలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో డప్పు మోగించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారంటూ ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తూ మార్పు కోసం పాటు పడాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులు, డ్వాక్ర మహిళలు, చేనేతలకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు అందరినీ మోసం చేశాడంటూ జగన్ ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వైసీపీని ఆశీర్వాదించాలంటూ ప్రజలను కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని కూడా నేరవేరుస్తానని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని అన్నారు. అందరూ కోరుకునే రాజన్న రాజ్యం కోసం అందరూ కోరుకుంటున్నారని తప్పకుండా రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మరాదని ఈ సందర్భంగా పెర్కోన్నారు. దోపిడీకి పాల్పడ్డ టీడీపీకి శాంతియుతంగా సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అమలుకావాలంటే రాజన్న రాజ్యం రావాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Similar News