అభినందన్ మీసానికి ఫిదా అవుతున్నయూత్

Update: 2019-03-05 06:03 GMT

అభినందన్ వర్ధమాన్ ఈ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. అభినందన్ మీసకట్టుకు యావత్ భారత్‌దేశంలో ఉండే యువత దాసోహం అంటోంది. ఇప్పుడు ఏ సెలూన్‌లో చూసినా అతని మీసకట్టు టాక్ నడుస్తోంది. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దేశ ప్రజలకు ఒక హీరోగా మారిపోయారు. సహజంగానే హీరోల హెయిర్, డ్రెస్సింగ్, సేవింగ్‌లను అనుసరించే అభిమానులు ఇప్పుడు అభినందన్ మీసానికి ఫిదా అవుతున్నారు.

దేశంలోని చాలా సెలూన్ షాపుల్లో అభినందన్ మీసకట్టు కావాలంటూ యూత్ ఎగబడుతున్నారు. అభినందన్ స్టైల్లో మీసం చేయించుకున్న వారు దానిని సోషల్ మీడియాలో పెడుతుండటంతో అది వైరల్ అవుతోంది. దీంతో ఒకరిని చూసి మరొకరు దీనిని అనుకరిస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి బెంగళూరు, పంజాబ్ వంటి ప్రాంతాల్లో పలు సెలూన్లు అభినందన్ హెయిర్‌కట్‌కు, మీసకట్టుకు భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. అభినందన్ మీసానికి యువతలో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. చాలా మంది అభినందన్ మీసకట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అతని స్టెల్ తమకు బాగా నచ్చిందని, తను నిజమైన హీరో అంటూ అభినందన్ స్టెల్‌ను ఫాలో అవుతున్నారు. ఎక్కడ చూసినా హెయిర్‌కటింగ్ సెలూన్‌లలో అభినందన్ మీసకట్టుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

అభినందన్ మీసకట్టుకు యావత్ భారత్‌దేశంలో ఉండే యువత దాసోహం అంటోంది. ఇప్పుడు ఏ సెలూన్‌లో చూసినా అతని మీసకట్టు టాక్ నడుస్తోంది. అతడి మీసకట్టు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా అభినందన్ ఇప్పుడు సినిమాలో హీరోల మాదిరి తన మీసం పవర్‌తో భారత్ పరువును నిలబెట్టడమే కాకుండా యువతకు ఆదర్శంగా నిలిచాడు. 

Similar News