టు.. ఆంధ్రా సీఎం వయా పాదయాత్ర!

Update: 2019-05-23 10:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన నాయకులదే విజయం. తన కడప గడప దాటి ప్రజల గుండెల్లోకి చేరుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఆ పాదయాత్ర తో నేరుగా ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్నారాయన. ఆయన ప్రజలతో మమేకమైన తీరు ఆయనను ప్రజల గుండెల్లో నిలిపింది. రాజన్నగా రాజశేఖర్ రెడ్డి కూడా ప్రజల కోసం వినూత్న పాలన అందించి.. రెండోసారి కూడా అదే జోరుతో అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

తరువాత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా ... మీ కోసం' అంటూ పాదయాత్ర చేపట్టిన 2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.

తాజాగా తన తండ్రి బాటలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాజాగా అధికారం చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. కాలినడన అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. టీడీపీ సర్కారు మోసాలను, వైఫల్యాలను సాధికారికంగా ప్రజలకు వివరించి చెప్పారు.

పాదయాత్ర విజయానికి రహదారి మాత్రం కాదు. ఆ యాత్రలో ప్రజలతో కలిసి వారి సాధక బాధకాలకు అండగా నిలబడే ప్రణాళికతో పరిపాలన సాగిస్తేనే.. వారిచ్చిన పదవికి వన్నె దక్కేది. రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రలో చూసిన ప్రజల కడగండ్లను కదతెర్చడానికి అధికారం లోకి వచ్చిన వెంటనే ఎన్నో పథకాలు చేపట్టారు. వాటిని విజయవంతంగా అమలు చేసి ప్రజల మనసులో శాస్వతంగా నిలిచిపోయారు. రెండోసారి ఆయన గెలుపు కోసం పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేకపోయింది. అదే.. చంద్రబాబు పాదయాత్ర తో సాధించుకున్న ముఖ్యమంత్రి పదవిలో తానిష్టం వచ్చిన రీతిగా.. ప్రజల ఆకాంక్షలకు దూరంగా మిగిలిపోవడంతో ఇపుడు ఆయనను నిర్ద్వందంగా పక్కన్ పెట్టారు.

ఇపుడు రాజన్న తనయుడిగా తమ కడగండ్లు తీర్చమని జగన్మోహన్ రెడ్డి మీద తిరుగులేని నమ్మకాన్ని ఉంచారు ప్రజలు. దానిని ఆయన నిలబెట్టుకుంటే ఎప్పటికీ మళ్లి పాదయాత్ర చేయాల్సిన అవసరం రాదు.. ఎవరన్నా చేసినా వారివంక ప్రజలు చూడరు.


Similar News