టీడీపీలోకి వంగవీటి... మరికాసేపట్లో..

Update: 2019-03-10 06:53 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో అంతుపట్టంలేదు. ఇటు అధికార, ప్రతిక్ష పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. అయితే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమౌతున్నారు మాజీ వైసీపీ నేత వంగవీటీ రాధాకృష్ణ. అయితే మరి కొద్దిసేపట్లోనే వంగవీటి టీడీపీ గూటికి చేరబోతున్నారు. అయితే వంగవీటి రాధాకృష్ణ చేరికను మాజీ ఎంపీ లగడపాటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటివలే వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే కాగా అప్పుడే టీడీపీ పార్టీలో చేరుతరనే జోరుగా ప్రచారం సాగింది. మొదటగా జనసేన పార్టీలో చేరుతారని వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఆయనను టీడీపీలోకి ఆహ్వానిస్తూ పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యలు కూడా చేశారు. 

Similar News