ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ

Update: 2019-02-28 05:05 GMT

ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు డిమాండ్‌ చేశాయి. పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్‌ ఉక్కుపాదం మోపాలని అమెరికా కోరింది. మౌలానా మసూద్‌ అజర్‌ను ఏ దేశంలో ప్రయాణించకుండా భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు నిషేధించాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్ కోరాయి. భారత్‌పై పాక్ దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం, పాక్‌ చేతుల్లోనే ఉందని తెలిపింది. 

Similar News