తెలంగాణ కేబినెట్‌ రేసులో ఆ 10మంది?

Update: 2019-02-15 11:57 GMT

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహన్‌‌ను కలిసిన కేసీఆర్‌ తన నిర్ణయాన్ని తెలిపారు. గవర్నర్‌తో కేసీఆర్ భేటీ తర్వాత కేబినెట్‌ విస్తరణపై ముఖ‌్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆరోజు ఉదయం 11గంటల 30 నిమిషాలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని డిసైడ్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై సీఎంవోకు, అధికారులకు ఆదేశాలిచ్చిన కేసీఆర్‌ కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రస్తుతం కేబినెట్‌లో 16 ఖాళీలు ఉండగా, ఎంత మందిని తీసుకుంటారు? ఎవరెవరిని తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. అయితే 19న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో సండ్ర వెంకటవీరయ్య, నిరంజన్‌‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, రెడ్యానాయక్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డితో పాటు జగదీశ్‌రెడ్డి లేదా గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఛాన్స్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.  

Similar News