సమ్మర్‌ హీట్‌.. జ్యూసెస్‌తో ప్రజలకు ఊరట

Update: 2019-04-18 13:29 GMT

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఇంకా ఎక్కువుగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నగరంలో 40-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పనుల మీద బయటకు వెళ్లే ప్రజలకు అనేక రకాల సమ్మర్ జ్యూసెస్ ఊరట కలిగిస్తున్నాయి. ప్రజలకు ఊరటకలిగిస్తున్న వివిధ రకాల సమ్మర్ జూసెస్‌పై స్పెషల్ ఫోకస్.

హైదరాబాద్‌ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. అయినా వివిధ పనులపై ప్రజలకు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రకాల జూస్‌లను త్రాగుతూ సమ్మర్‌ హీట్‌ నుంచి సేద తీరుతున్నారు. ఎటువంటి డ్రింక్స్ త్రాగితే ఉపయోగం ఉంటుందో వివరిస్తున్నారు. ఓల్డ్‌సిటీలో లభించే సమ్మర్‌ డ్రింక్స్‌లో ఫలూదా చాలా ప్రత్యేకమైనది. క్వాలిటీ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తున్నట్లు అక్కడి షాప్‌ ఓనర్ చెబుతున్నారు. ఓల్డ్ సిటీ శీతల పానీయాలకు ప్రసిద్ధి. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ లభించే స్పెషల్ డ్రింక్స్‌ తాగుతూ సమ్మర్‌ హీట్‌ నుంచి రిలీఫ్ పొందుతున్నారు. హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ సమీపంలో కొన్ని ప్రత్యేక షాపులు పుదీనా, రాగిజావ, బటర్‌మిల్క్, లెమన్‌ వంటి డ్రింక్స్‌ వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి.  

Similar News