వైభవంగా ప్రారంభమైన సీతారాముల శోభాయాత్ర

Update: 2019-04-14 08:51 GMT

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. పాతబస్తీ సీతారాంబాగ్ ఆలయం దగ్గర మొదలైన శోభాయాత్ర దూల్ పేట , అఫ్జల్ గంజ్ , గౌలిగూడ మీదుగా కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు నిర్వహిస్తారు. దాదాపు 7 కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్ర లో పాల్గొనడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

హైదరాబాద్ లో జరుగుతున్న శ్రీరామ శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే మార్గంలో 25 ప్రార్థనా మందిరాల దగ్గర 2500 మంది మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ , టాస్క్ ఫోర్స్ , అదనపు బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 250 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే మద్యం విక్రయాలను రద్దుచేశారు. 

Similar News