వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న నిజరుపదర్శనం

Update: 2019-05-07 05:20 GMT

సింహాద్రి అప్పన్న చందనోత్సవ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం వేకువజామునే పూసపాటి వంశస్థులు పూసపాటి అశోక్ గజపతి రాజు ఆనవాయితీ ప్రకారం స్వామి వారికి తొలి చందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం అశోక్ గజపతి రాజు, ఆయన కుటుంబ సభ్యులు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ రోజు నిజరూప దర్శనం ఇవ్వనున్న నరసింహుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ ఎం పద్మ, టిటిడి తరుపున జె ఈ వో శ్రీనివాసరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ దర్బంగా క్రికెట్ క్రీడాకారుడు వి వి ఎస్ లక్ష్మణ్ ,హోమ్ మంత్రి చినరాజప్ప, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, డీజీపీ ఆర్ పి ఠాగూర్ అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నారు. 

Similar News