ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

Update: 2019-04-21 08:07 GMT

తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి ఘటనలో మొత్తం నలుగురు మహిళలతో సహా ఏడుగురు భక్తులు చనిపోగా సుమారు 10 మంది గాయపడ్డారు. వారిని తురైయూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. తురైయూర్‌ సమీపంలోని ముత్యంపాలయంలో ఉన్న కరుప్పనస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉత్సవంలో నాణేల పంపిణీ జరిగినప్పుడు క్యూలో ఉన్న భక్తులు తొక్కిసలాటడం జరగడం వల్లే జరిగిందని తెలిపారు.

ఆలయంలో ఏటా ఘనంగా జరిగే ఉత్సవం కావడంతో ఆదివారంనాడు భక్తులు పోటెత్తారు. అయితే ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు హుండీలో వేసిన డబ్బుల్లో నుంచి రూపాయి బిళ్లలను సేకరించి, వాటితోనే పూజిస్తారు. కాగా ఆ తర్వాత వాటిని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విపరితమైన నమ్మకం. అయితే ఆ నాణేల కోసం తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది.మృతి చెందిన వారిలో ఎ.శాంతి (50), రామర్ (50), వి.పూంగవనం (50), ఆర్.లక్ష్మీకాంతం (60), కె.రాజవేల్ (55), ఎస్.గాంధయీ (38) , ఆర్.వల్లి (35)గా గుర్తించారు. వీరంతా కరూర్, కడలూరు,సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందిన వారు. 

Similar News