గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టిడిపి నిలదొక్కుకోలేకపోయింది .. పట్టుమని పాతిక సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది .. దీనితో వర్మ జగన్ ని పొగిడేస్తూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు ..వరుస ట్వీట్ లతో రెచ్చిపోతున్నారు వర్మ ..
నిన్న విజయవాడలో జరిగిన జగన్ ప్రమాణస్వీకారానికి వర్మ అటెండ్ కావడం అందరిని షాక్ కి గురిచేసింది .. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయన ఇలాంటి రాజకీయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ఎప్పుడూ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో జగన్ ప్రమాణ స్వీకారంలో కెమెరా కళ్లన్నీ వర్మ పైనే ఉన్నాయి.
జగన్ ప్రమాణస్వీకారం ముగియగానే వర్మ మళ్లీ ట్విట్టర్లో తన పెన్నుకు పదును పెట్టాడు .. ఈ ట్వీట్లలో టీడీపీ భవితవ్యం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మాత్రమే ఉందని తనదైన శైలిలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ చేతికి అప్పగించాలని ఆయన సూచించారు. టీడీపీని కాపాడే సత్తా కేవలం తారక్‌కి మాత్రమే ఉందని, తన తాత పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎన్టీఆర్ వెంటనే టీడీపీ పగ్గాలను చేతిలోకి తీసుకోవాలని ట్వీట్ లో వర్మ పేర్కొన్నారు.
If Tarak takes over TDP , all people will immidiately forget TDP's disastrous failure..NTR's grandson can be the only saviour and if he has any respect for his grandfather he should immoderately save TDP Jai NTR Jai TARAK
— Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2019