బెంగాల్‌ పోలింగ్‌లో ఫైటింగ్...మమత సర్కారు తీరుపై రాజ్‌నాథ్‌ సింగ్ ఆగ్రహం

Update: 2019-04-18 07:45 GMT

ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అల్లరిమూకలు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ పోలింగ్‌ కేంద్రాల దగ్గర బీభ్సతం సృష్టిస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులకు దిగారు. ఇటు రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారని సీపీఎం, బీజేపీ ఆరోపిస్తున్నాయి. కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాలను స్వాధీనం చేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీరియస్‌ అయిన హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మరిన్ని బలగాలు పంపిస్తామన్నారు. మమత సర్కారు తీరుపై మండిపడ్డ రాజ్‌నాథ్‌ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Similar News