కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒకటే: మోడీ

Update: 2019-03-29 09:59 GMT

తెలంగాణ సీఎం కేసీఆరే టార్గెట్‌గా భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రవ్యాఖ్యలు చేశారు. పాలమూరు బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ అసలు టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారో ఇప్పటి వరకు చెప్పలేదని, కేబినెట్‌ ఏర్పాటులో ఆలస్యం చేశారన్నారు. ఆలస్యానికి కూడా ఏ జ్యోతిష్యుడో కారణం అయి ఉండొచ్చన్నారు మోడీ, మోడీ స్టార్‌ ముందు ఓడిపోతామని టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది ఇది కూడా ఏ జ్యోతిష్యుడో చెప్పి ఉండొచ్చన్నారు మోడీ. అసలు తెలంగాణ భవిష్యత్‌ను ప్రజలు నిర్ణయించాలా? జ్యోతిష్యుడు నిర్ణయించాలా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తోందని అలాగే తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలే కొనసాగుతున్నాయి అని అన్నారు. అసలు కాంగ్రెస్‌ పార్టీకి, టీఆర్‌ఎస్‌ పార్టీకి తేడా లేదు రెండూ ఒకటే అన్నారు ప్రధాని మోడీ. కేసీఆర్‌ కేవలం కుటుంబం కోసమే పాటుపడుతున్నారని, ప్రజల కోసం కాదన్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పొత్తు తెలంగాణ కోసం కాదు వాళ్ల స్వార్థం కోసమే అని అన్నారు.

Similar News