జైట్లీ స్థానంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న పియూష్‌ గోయల్‌

Update: 2019-01-24 00:59 GMT

అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం దెబ్బతినడంతో అతను కోలుకునే వరకూ కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి సూచన మేరకు అరుణ్‌ జైట్లీ కోలుకునే వరకూ అతని అధీనంలో ఉన్న ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను తాత్కాలికంగా పీయూష్‌ గోయల్‌కు అప్పగిస్తున్నాం అని ప్రకటన తెలిపింది. దీంతో జైట్లీ స్థానంలో పీయాష్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అరుణ్‌ జైట్లీ ప్రస్తుతం చికిత్స కోసం అమెరికాలో ఉన్నారు అరుణ్‌ జైట్లీ నుంచి ఆర్థిక శాఖ బాధతలను స్వీకరించడం పీయూష్‌ గోయల్‌కు ఇది రెండోసారి. గత ఏడాదిలో కూడా అరుణ్‌ జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగినప్పుడూ కూడా పీయూష్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

Similar News