భీమవరం నుండే పవన్ గేలుపు ...?

Update: 2019-05-21 10:26 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఓడిపోతుందా ? గెలుస్తుందా? అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ గెలుస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న .. అయితే ఎన్నికల ముందు జనసేన కింగ్ మేకర్ అవుతుందని జనసేన సైనికులు ఆశించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన తరవాత అ పార్టీకి రెండు కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదని అన్ని సర్వేలు స్పష్టం చేసాయి ..

అయితే ఎగ్జిట్ పోల్స్ ని కొందరు జనసేన నేతలు కొట్టిపడేసారు. కానీ ఇప్పుడు జనసేన సైనికుల్లో పవన్ గెలుస్తాడా? లేదా ? అనే ఆందోళన మొదలయ్యింది . ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుండి పోటికి దిగారు .. ఇందులో అయన ఎక్కడి నుండి గెలుస్తారు? అసలు గెలుస్తారా లేదా అన్న ఉత్కంట ఇప్పుడు మొదలయింది .

పవన్ ఎంచుకున్న రెండు నియోజకవర్గంలో కాపు సామజీకవర్గం ఎక్కువే .. దీనితో రెండు చోట్ల అయన గెలుపు నల్లురుపై నడకే అనుకున్నారు అంతా.. కానీ అయన ఇప్పుడు ఒక దగ్గరి నుండే గెలవబోతున్నారు అని తెలుస్తుంది . ముందుగా అయన భీమవరంలో వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ మధ్య మంచి పోటి నడిచిందని అ పోరులో పవన్ గెలుపు కష్టమేనని వార్తలు వచ్చాయి . కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ భీమవరం నుండి భారీ మెజారిటీతో గెలుస్తున్నారని తెలుస్తుంది . గాజువాకలో వైసీపీ గెలుపు ఖాయమని తెలుస్తుంది . 

Similar News