భీమ‌వ‌రంలో కాట‌మ‌రాయుడు ఆసక్తికర వ్యాఖ్యాలు..

Update: 2019-03-22 13:46 GMT

జనసేనాని రెండో అసెంబ్లీ స్థానం ప.గో జిల్లా భీమవరంలో నామినేషన్ వేశారు. అభిమానుల మధ్య అట్టహాసంగా వచ్చి భీమవరం శాసనసభ సీటుకి నామినేషన్ దాఖలు చేశారు. భీమవరంతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పవన్ కల్యాణ్ తనను ఎమ్మెల్యేని చేస్తే అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. ఇక్కడ పుట్టిన గిరిజనుల కోసం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పనిచేస్తానని చెప్పారు.

నామినేషన్ వేయడానికి మందు జనసేనాని భీమవరంలోని ఆలయంలో పూజలు చేశారు. తర్వాత నిర్మలాదేవీ కల్యాణమండపంలో అభిమానులు, పార్టీ ప్రముఖులు, అన్ని వర్గాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. తనకు కులం, మతం లేదన్న పవన్ కల్యాణ్..తనకు కేవలం మానవత్వం మాత్రమే ఉందని చెప్పారు. తానెప్పుడూ ఎవరిని ఏమి అడగలేదనీ ఈ ఒక్కసారి ఎమ్మెల్యేని చేయమని అడుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఒక్క అవకాశం ఇస్తే అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతానని జనసేనాని హామీ ఇచ్చారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పవన్‌ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు.

పవన్ కల్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో చోట్ల పోటీ చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే గాజువాకలో నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్ మరుసటి రోజు భీమవరంలో నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల విజయం సాధిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Similar News