ఎన్టీఆర్ లాగే జగన్ .. పరుచూరి

Update: 2019-06-25 14:38 GMT

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే .. అయితే వైసీపీలో జగన్ పాత్రను ఎవరికీ తోచినట్టుగా వారు అభివర్ణించారు. వైసీపీ విజయాన్ని సినీ నటుడు మరియు ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ మాత్రం నటుడు మరియు దివంగత నేత ఎన్టీఆర్ తో పోల్చారు .. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి అధికారంలోకి వచ్చేవరకు ప్రజల మధ్యలోనే ఉన్నారని అలాగే జగన్ కూడా ప్రజల మధ్యలోనే ఉన్నారని అధికారం లోకి వస్తే ఎం చేస్తామో స్పష్టంగా చెప్పారని అన్నారు . ఎన్టీఆర్ - జగన్ ప్రజలతో మమేకం అయిన తీరు ఒకటేనని అయన వాఖ్యానించారు .. అప్పుడు ఎన్టీఆర్  కి ఎలా అయితే ప్రజలు ఒక్క అవకాశం ఇద్దామని ఎలా అనుకున్నారో ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరిగిందని అన్నారు . ఇక చంద్రబాబుకి దూరం అవడం వల్లే పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అన్నది వాస్తవం కాదని అయన అభిప్రాయపడ్డారు .. 

Tags:    

Similar News