ఎమ్మెల్యే సీతక్కకు అవమానం

Update: 2019-06-02 11:11 GMT

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీతక్కను అధికారులు వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీతక్క మాట్లాడుతూ తాను ఆదివాసీననే అవమానించారన్నారు. దొడ్డి దారిన వచ్చిన వారికే విలువ ఇస్తున్నారని, తనను అవమానిస్తే ములుగు ప్రజలను అవమానించినట్లేనని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

Similar News