ఏపీలో జగన్‌ విజయం తథ్యం

Update: 2019-05-17 07:17 GMT

ఏపీ ఫలితాలకు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఏపీ విజేత ఎవరో అని ప్రజలు, పార్టీ నేతలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఓ.సీ.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆకస్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని జి.కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌పైనా, ఐఏఎస్‌లపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో వైసీపీ విజయం తథ్యమని తేలడంతో ఈవీయంలపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు, అధికార దుర్వినియోగం, హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. గత ఐదేండ్ల పాలనలో నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు మరో ఐదు కట్టవచ్చని జి.కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Similar News