ఎన్టీఆర్‌ను ఆదరించిన నేల.. తనయుడిని పొమ్మంటోందా?

Update: 2019-04-03 12:32 GMT

ఏపీ ఎన్నికలకు పట్టుమని వారంరోజులు మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే ఆయాపార్టీ అధినేతలు ప్రచారంలో ముమ్ముర ప్రచారం చేస్తున్నారు. కాగా ఏపీలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ నియోజకవర్గం నుండే ఒక మహానాయుకుడు గొంతు వినిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే శాసించాడు. అసలు ఎక్కడ ఆ నియోజకవర్గం, అసలు ఆ నియోజకవర్గం అని అనుకుంటున్నారా? అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం. నాడు మహా నాయకుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన్ని ఆదరించి శాసనసభకి పంపించింది హిందూపురం నియోజకవర్గం. కానీ ఇప్పటికీ హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ ను గుండెల్లో పెట్టుకున్నారు. ఇక అదే నియోజకవర్గం నుండి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన బాలయ్యను ఆదరించింది. అక్కున చేర్చుకుని గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించింది.

అయితే ఎన్టీఆర్ లా ప్రజలను సాకడంలో బాలయ్యబాబు పూర్తి విఫలమయ్యాడని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పడు బాలయ్యను ఆ నియోజకవర్గమే చిదరించుకొంటుందా? అంటే ముమ్మటికి అవుననే చెబుతున్నాయి సర్వేలు. ఈసారి ఎన్నికల్లో బాలయ్యను ఓడించేందుకు కంకణం కట్టుకుందన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య దాడులు, ప్రతిదాడులు, అక్కడి సమస్యలను గాలికొదిలేసి హిందూపురం నియోజకవర్గానికి గుదిబండగా మారారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్యబాబు గల్లీ గల్లీ తిరుగుతున్నా కానీ ప్రజల్లో ఎటువంటి స్పందనా కానరావడం లేదు. ఇందుకు ఈ ఐదేళ్లలో బాలయ్య చేసిన పనులే కారణమని చెబుతున్నారు. హిందుపురం నియోజకవర్గంలో అసలు అభివృద్ధిని పట్టించుకోకపోవడం, తాగునీటి సమస్య సహా తిష్టవేసిన సమస్యలు తీర్చడంలో బాలయ్య బాబు పూర్తి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రజలను తన ఇష్టానుసారంగా తిట్టడం లాంటీ మరేన్నే కారణాలు ఉన్నాయి. మరీ ఈసారి హిందుపురం ప్రజలు నాన్నగారీ ముఖం చూసి మళ్లీ గెలిపిస్తారా? లేక బాలయ్య ఐదేండ్ల పరిపాలన మీద విసుచెందిన ప్రజలు తిప్పికొడతారా అన్నది ఇక్కడి పాయంట్. హిందుపురం ప్రజలు ఈసారి కూడా బాలయ్య ఆశ్వీరదించి అసెంబ్లీకి పంపుతారో లేక ఏకంగా ఇంటికే పంపుతారో వేచి చూడాల్సిందే.

Similar News