ఉత్కంట పోరులో న్యూజిలాండ్ విజయం ..

Update: 2019-06-06 01:02 GMT

ప్రపంచ కప్ లో నిన్న జరిగిన ఉత్కంట పోరులో న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఇరు జట్ల మధ్య దోబూచులాడినా మ్యాచ్  ఫైనల్ గా విజయం మాత్రం న్యూజిలాండ్ దే  అయింది . దీనితో న్యూజిలాండ్ ఈ టోర్నీలో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది .

మొదటగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన బంగ్లాకి మంచి శుభారంభమే లభించింది . ఓపెనర్లు తమిమ్ ఇక్బాల్ (24) సౌమ్య సర్కార్ (25) తొలివికెట్ కి 45 పరుగులు జోడించారు . మంచి స్కోర్ దిశగా పయనిస్తున్న బంగ్లాని హేన్ర్రి, బౌల్డ్ దెబ్బతీయడంతో బంగ్లా వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది . ఇక అ తర్వాత వచ్చిన రహీం(19) కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవకపోవడంతో బంగ్లా 110 పరుగులకే మూడు వికెట్లు కొల్పవాల్సి వచ్చింది ..

ఇక అ తర్వాత వచ్చిన షకిబ్ అల్ హసన్ మరియు మిధున్ బంగ్లా ఇన్నింగ్స్ ని చక్కబెట్టే పనిలో పడ్డారు .. ముఖ్యంగా షకిబ్ అల్ హసన్ చూడచక్కని షాట్లతో అలరించాడు . ఈ క్రమంలోనే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు . అయితే షకిబ్ అల్ హసన్ ని గ్రౌండ్ హోమ్ అవుట్ చేయడంతో బంగ్లా మళ్ళీ కష్టాల్లో పడింది .. ఇక చివర్లో మహ్మదుల్లా మరియు సైపుద్దిన్ భారీ ఇన్నింగ్స్ ఆడడంతో బంగ్లా నిర్ణిత 50 ఓవర్లలో 244 పరుగులు చేయగలిగింది ..

ఇక 245 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కి ఆరంభంలో మంచి దూకుడుని ప్రదర్శించిన షకిబ్ మాయాజాలానికి తలవంచక తప్పలేదు . గుప్తిల్ (25), మన్రో (24) త్వరగానే వెనుదిరిగారు . ఇక అ తరవాత వచ్చిన కెప్టన్ విలయమ్సన్ మరియు రాస్ టేలర్ ఇన్నింగ్స్ ని చక్కబెట్టే ప్రయత్నం చేసారు .ఇందులో రాస్ టేలర్ చక్కని ఆటను కనబరిచాడు .

వీరిద్దరూ కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు . అ తరవాత విలయమ్సన్ అవుట్ అయ్యాడు . అ తరవాత వచ్చిన లేథమ్ (0) అవుట్ అవడం, త్వరగానే టేలర్ కూడా వెనుదిరగడంతో మళ్ళీ కష్టాల్లో పడింది న్యూజిలాండ్ .. ఇక మ్యాచ్ చివర్లో శాంట్నర్ మరియు ఫెర్గుసన్ కివిస్ ని విజయతీరాల వైపు తీసుకువెళ్ళారు ..  

Tags:    

Similar News