సస్పెన్స్ కు తెరపడింది

Update: 2019-05-27 11:23 GMT

ఎట్టకేలకు సస్పెన్స్ విడిపోయింది. తెలంగాణా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి గా ఎవరు నిలుస్తారని జరుగుతున్నప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, నవీన్ రావుకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడటంతో నవీన్ రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

అయితే, ఈ ఎమ్మెల్సేయే స్థానాన్ని సుఖేంద్ర రెడ్డికి కేటాయిస్తారని రెండు రోజులుగా జోరుగా  ప్రచారం సాగింది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నవీన్ రావు కు అవకాశం కల్పించడం తో ఆ ప్రచారాలకు బ్రేక్ పడింది. 

Similar News