ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపై సస్పెన్షన్ వేటు

గత మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన రాజంపేట రాజకీయం ఊహించని మలుపు తిరిగింది.

Update: 2019-01-22 08:47 GMT

గత మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన రాజంపేట రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలతో చర్చల సందర్భంగా మేడా తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలియడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. విప్‌ పదవి ఇచ్చి గౌరవించినా పార్టీకి విధేయత చూపకుండా మేడా పెద్ద తప్పు చేశారంటూ చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం.

Similar News