ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం...మసూద్‌ అజార్‌ ఇక...

Update: 2019-05-01 13:38 GMT

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం లభించింది. పఠాన్‌కోట్, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. మసూద్‌ అజర్‌కు చెందిన ఆస్తులను స్తంభింపజేయనున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్‌ పేరు చేర్చింది. మసూద్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చకుండా గతంలో నాలుగుసార్లు చైనా అడ్డుకుంది. అయితే, ఈసారి మాత్రం మసూద్‌ అజర్‌ విషయంలో అభ్యంతరాలను చైనా వెనక్కి తీసుకుంది. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఒత్తిడితో చైనా తన వైఖరి మార్చుకుంది. 

Similar News