జగన్, విజయసాయిపై కుటుంబ రావు ఫైర్

Update: 2019-04-24 08:38 GMT

జగన్, విజయసాయిపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు ఫైర్ అయ్యారు. జగన్, విజయసాయి బెయిల్ షరతులు పాటిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. జగన్, విజయసాయిలపై ఉన్న కేసులను సాగదీయకుండా చూస్తే ఇద్దరి బండారం బయటపడుతుందని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఎక్కువ పేజీలు ఆయన నేర చరిత్రకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. ట్విట్టర్‌లో విజయసాయి పోస్టు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను కుటుంబ రావు ఖండించారు. 

Similar News