కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్ బేబీలే

కౌరవులు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలేనని ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ జి.నాగేశ్వరరావు అన్నారు. పంజాబ్‌లోని జలంధర్లో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఏయూ వీసీ విద్యార్థులకు పురాణాల్లో సైన్స్ గురించి పూసగుచ్చినట్టు చెప్పారు.

Update: 2019-01-05 07:30 GMT
G Nageshwar Rao

కౌరవులు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలేనని ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ జి.నాగేశ్వరరావు అన్నారు. పంజాబ్‌లోని జలంధర్లో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఏయూ వీసీ విద్యార్థులకు పురాణాల్లో సైన్స్ గురించి పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కౌరవుల మాతృమూర్తి గాంధారి గురించి ప్రస్తావించారు. వంద అండాలను వంద కుండల్లో ఉంచి ఫలదీకరించిన మీదటే కౌరవుల జననం జరిగిందన్నారు. వారిని టెస్ట్‌ట్యూబ్‌ బేబీలు కాదంటారా అని ప్రశ్నించారు. మైసూర్ పాలకుడు టిప్పుసుల్తాన్ అనేక యుద్ధాలు చేశాడని వాటిలో అత్యాధునిక ఆయుధాలను వాడాడని నాగేశ్వరరావు వివరించారు.

రామాయణంలోని కొన్ని అంశాల గురించి కూడా ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్ నాగేశ్వర రావు ప్రస్తావించారు. రామాయణంలో రావణుడు పుష్పక విమానం వాడేవాడని రావణుడి వద్ద మరో 24 రకాల విమానాలు కూడా ఉండేవని ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు. వివిధ రకాల పనులకు వివిధ రకాల విమానాలను రావణుడు వినియోగించేవాడని, లంకలో విమానాశ్రయాలు కూడా ఉండేవని ఏయూ వీసీ అన్నారు.

Similar News