అందుకే ఝాన్సీని దూరంగా పెట్టా: సూర్య

Update: 2019-02-06 07:13 GMT

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్య hmtvతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడాడు. ఝాన్సీని తాను ప్రేమించలేదంటున్న సూర్య ఆమే తనను ప్రేమిస్తున్నానని చెప్పిందని అన్నారు. ఝాన్సీ ప్రపోజల్‌పై తాను ఆలోచనలో ఉన్నానని ఇంతలో ఆమె ప్రవర్తన నచ్చక దూరం పెట్టానని చెప్పుకొచ్చాడు. తనకు వాట్సప్‌ చేసిన మెసేజ్‌లను ఝాన్సీ డిలీట్ చేసిందన్న సూర్య ఆమె ఏం మెసేజ్‌లు చేసిందో తాను కూడా చదవలేదన్నారు. ఝాన్సీ ఓ ఫంక్షన్‌లో పరిచయమైందని, ఝాన్సీకి సీరియల్‌ ఛాన్సుల్లేవని అన్నాడు. తాను సీరియల్స్ మానేయమని చెప్పానన్న వార్తల్లో నిజం లేదన్నాడు.

Full View

Similar News