శ్రీవారిని దర్శించుకున్న జగన్

Update: 2019-05-29 05:01 GMT

కాబోయే సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన జగన్.. స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన జగన్ కు మహాద్వారం వద్ద అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. జగన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. తిరునామం, సంప్రదాయ వస్త్రాలతో జగన్.. శ్రీవారిని దర్శించుకోవడం వెళ్లడం విశేషం. జగన్ దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయంలో కనిపించిన పలువురు నేతలను జగన్ పలకరించి ముందుకు సాగారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన జగన్.. క్యూలైన్ లో వెళ్లి, స్వామి వారిని దర్శించుకున్నారు. గతంలో పలుసార్లు తిరుమల జగన్ వచ్చినా.. ఈసారి మాత్రం పూర్తి సంప్రదాయ వస్త్రాలతో వచ్చి, శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జగన్‌కు.. వేదపండితులు ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని ఆయనకు అందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, రోజా, సామినేని ఉదయభాను, పలువురు సీనియర్‌నేతలు జగన్‌తో పాటు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఆలయంలో శ్రీవారి సేవలో గడిపిన వైఎస్‌ జగన్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు. జననేత ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా ఆయన శ్రీవారి దర్శించుకున్నారు.

Similar News