ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగింతపై కేసీఆర్ హర్షం

Update: 2019-06-03 02:05 GMT

హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పట్ల సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుండే జరుగుతున్నందున హైదరాబాద్ లోని భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. అలా ఖాళీగా ఉండే బదులు ఉపయోగంలోకి తీసుక రావాలనే ఆలోచన ఉత్తమం అయినదని సీఎం అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలే పరమావదిగా, స్నేహ భావంతో ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. ప్రతీ విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు ప్రభుత్వాలు పని చేస్తాయని సీఎం ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని, అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతం అని సీఎం అన్నారు. 

Similar News