రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాల వెల్లడి

Update: 2019-04-17 12:23 GMT

ఇంటర్ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,42,719 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి విద్యార్ధులు, తలిదండ్రులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్నా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు గురువారం రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో గల తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్, విద్యాభవన్‌లో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1300 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.  

Similar News