పవన్ ఓడిపోవడం నిజంగా జాలేస్తుంది :జీవితా రాజశేఖర్

Update: 2019-05-25 11:39 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన చిత్తూ చిత్తుగా ఓడిపోయింది . పవన్ కూడా రెండు చోట్లల్లో ఓడిపోయరు. అయితే అయన ఓటమిపై స్పందించారు జీవితా రాజశేఖర్ .. అయన రెండు చోట్లల్లో ఓడిపోవడం నిజంగా చాలా జాలేస్తుందని అన్నారు.. కనీసం అయిన ఒక్క చోటు నుండి అయిన గెలిస్తే బాగుండు అని అన్నారు ..హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో రాజశేఖర్ ఈ వాఖ్యలు చేసారు ..

గాజువాకలో తాము పవన్ కళ్యాణ్ ను ఓడించాలని ప్రయత్నించలేదని.. వైసీపీ పార్టీ ప్రచారంలో ఇచ్చిన లిస్ట్ లో గాజువాక కూడా ఉండడంతో అక్కడికెళ్లి ప్రచారం చేశాము తప్పితే పవన్ ను ఓడించాలని కాదని రాజశేఖర్ వివరణ ఇచ్చారు. వైసీపీలో చేరగానే లిస్ట్ ఇచ్చారని దాని ప్రకారమే వెళ్లాల్సి వచ్చిందన్నారు.

ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు . పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇన్ని రోజులు అయిన మేము అయన పై కామెంట్స్ కూడా చేయలేదని అన్నారు .. అయితే పవన్ మాత్రం తన గబ్బర్ సింగ్ సినిమాలో తన క్యారెక్టర్ ను అవమానించేలా అల్లరి చేయించి అనుకరింపచేశాడని.. దానిపై కూడా తాను కామెంట్ చేయలేదని రాజశేఖర్ వాపోయారు.

అయితే తోటి సినిమా నటుడిగా పవన్ రెండు చోట్ల ఓడిపోవడం మాత్రం జాలేసిందన్నారు. మొన్న పవన్ ఓడిపోయాక ఇచ్చి స్టేట్ మెంట్ చూసి తనకు చాలా బాధేసిందని.. అంత దీనంగా పవన్ మాట్లాడాకా ఆయన ఒక్క సీట్లో అయినా గెలిచి ఉంటే బాగుండేదని అనిపించిందని రాజశేఖర్ తెలిపారు. 

Full View

Similar News