మళ్లీ భగ్గుమన్న ఇంధన ధరలు

Update: 2019-01-14 06:00 GMT
Fuel Prices

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర మళ్లీ 70 రూపాయల మార్క్‌ను దాటింది. కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ప్రధాన ఇంధన కంపెనీలు ఇవాళ పెట్రోల్‌పై 37-40 పైసలు, డీజిల్‌పై 49-53పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 70.13కు చేరింది. కోల్‌కతాలో 72.24, ముంబయిలో 75.77, చెన్నైలో 72.79గా ఉంది. ఇక డీజిల్‌ ధర ఢిల్లీలో 64.18, కోల్‌కతాలో 65.95, ముంబయిలో 67.18, చెన్నైలో 67.78గా ఉంది. జనవరి 7న ఒకసారి, ఆ తర్వాత జనవరి 10 నుంచి వరుసగా ఇంధన ధరలు ప్రతి రోజూ పెరుగుతూ వస్తున్నాయి.

Similar News