యాలకులు మరింత ప్రియం..కిలో ఎంతంటే..

యాలకులు... సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులను మనం ఎక్కువగా వంటింట్లోనే వాడుతుంటాం. మసాలా పదార్థాలు, స్వీట్లలో సువాసన కోసం వీటిని వాడుతుంటాం. అయితే ఆరోగ్యపరంగానూ యాలకులు ఎంతో మేలు చేస్తాయి.

Update: 2019-08-30 05:17 GMT

యాలకులు... సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులను మనం ఎక్కువగా వంటింట్లోనే వాడుతుంటాం. మసాలా పదార్థాలు, స్వీట్లలో సువాసన కోసం వీటిని వాడుతుంటాం. అయితే ఆరోగ్యపరంగానూ యాలకులు ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం వీటి ధర చూస్తే ఆకాశాన్ని అంటుతోంది. యాలకుల ధర అమాంతం పెరిగిపోయింది. గత నెల వరకూ రాష్ట్రంలో కిలో ధర రూ. 5వేలు ఉండేది కానీ ఇప్పుడు ఏకంగా రూ. 8.000.పలుకుతోంది. మార్కెట్లో విడిగా తులం రూ.100గా కొనుగోలు చేస్తున్నారు. ఇక పెరిగిన యాలకుల ధరతో అమ్మడానికి దుకాణ యజమానులు సైతం వెనుకంజవేస్తున్నారు. ఇలాచి ప్రియం కావడంతో కావలసినంత మోతాదులో దీనిని కలపక రుచి తగ్గిందని బిర్యానిప్రియులు వాపోతున్నారు. 

Tags:    

Similar News